Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీలతో చోరీలు 7గురు అరెస్ట్!

Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించి కాపర్ కేబుల్స్ చోరీ చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Updated on: 23 Sept 2026 5:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీలతో చోరీలు 7గురు అరెస్ట్!

Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించి ఇనుము, కాపర్ కేబుల్స్ చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు క్రైమ్ ఏసీపీ వెంకటరావు, సౌత్ క్రైమ్ సీఐ జీడీ బాబు బుధవారం స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి సుమారు 300 కిలోల కాపర్ కేబుల్స్, రెండు రబ్బరు స్టాంపులు, ఐదు నకిలీ ఐడీ కార్డులు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో పైడిపాటి వెంకట భార్గవ్@ బన్నీ రౌడీ షీటర్, పోతిన శ్రీకాంత్, ఇసుకపల్లి నాగేంద్ర వర్మ, గర్తియ రవి శంకర్, బంగారు సతీష్ కుమార్, ఇసుకపల్లి వంశీ, నవాబు యువరాజు ఉన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.