Gajuwaka: గజువాక భాస్కర్ స్కూల్‌లో 'పిల్లల పెంపకం' అంశంపై ప్రత్యేక సెమినార్!

Gajuwaka: విశాఖ గజువాక 87వ వార్డు భాస్కర్ విద్యానికేతన్‌లో పిల్లల పెంపకంపై సెమినార్. ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రముఖ సైకాలజిస్ట్ కె. చంద్రశేఖర్.

PRAKASH, GAJUWAKA
Published on: 24 Oct 2026 7:32 PM IST
Gajuwaka
X

Gajuwaka: గజువాక భాస్కర్ స్కూల్‌లో 'పిల్లల పెంపకం' అంశంపై ప్రత్యేక సెమినార్!

గాజువాక: 87వ వార్డు చట్టివానిపాలెం భాస్కర్ విద్యానికేతన్ స్కూల్ నందు తల్లిదండ్రులుతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పిల్లల పెంపకం ఒక కళ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య వక్త గా ప్రముఖ సైకాలాజిస్ట్ కె చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సంధర్భంగా ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలను ప్రేమించాలని, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలని, ప్రతీ రోజూ పిల్లలకు కొంత సమయం కేటాయించాలని, వారిని ప్రశంసిస్తూ ప్రోత్సహించాలని, వారిలో మంచి అలవాట్లు పెంపొందించాలని, వారి భావోగ్వేగాలను అర్ధం చేసుకోవాలని, మొబైల్ ఫోన్ వాడకుండా చూడాలని, సంతోషకరమైన కుటుంబ వాతావరణం వుండేటట్లు చూసుకోవాలని, మార్కుల కోసం పక్కవారితో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదని సూచించారు. పిల్లల చేసిన పొరపాట్లకు దండించకుండా మృదువుగా చెప్పాలని తద్వారా పిల్లలకు మంచి క్రమశిక్షణ, చక్కని భవిష్యత్తు ఉంటుందని సూచించారు. పాఠశాల కరెస్పాండంట్ పాలవలస భాస్కర్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని అప్పుడే వారిని మంచి విద్యార్థులు గా తీర్చిదిద్దగలమని, పిల్లల బంగారు భవిష్యత్ కోషమై ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 200మంది తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA