Araku: అరకులో ఘనంగా కూటమి పార్టీల సమన్వయ సమావేశం!
Araku: అరకు నియోజకవర్గంలో కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు. గెలుపు అవకాశాలు ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని టీడీపీ ఇన్చార్జ్ దొన్ను దొర పిలుపునిచ్చారు.
Araku: అరకులో ఘనంగా కూటమి పార్టీల సమన్వయ సమావేశం!
Araku: అభ్యర్థి ఎంపికలోనే సగం గెలుపు ఉంటుందని అందుకే కూటమి పార్టీల నుంచి ఎవరు బరిలో దిగితే 100% గెలుస్తారన్న నమ్మకం ఉందో ఆ వ్యక్తులను మాత్రమే అభ్యర్థులుగా నిలపాలని తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.
కూటమి పార్టీల సమన్వయ కమిటీల సమావేశం శనివారం సాయంత్రం అరకు వేలిలోని ఉషోదయా రిసార్ట్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్నికల అబ్జర్వర్ శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారు, నియోజకవర్గం బుద్ధ నాగ జగదీష్ గారు, జనసేన పార్టీ అరకు పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి, ఆంధ్రప్రదేశ్ జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య గారు, బిజెపి అల్లూరి జిల్లా అధ్యక్షులు శ్రీమతి మఠం శాంత కుమారి గారు, బిజెపి, టిడిపి , జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొన్ను దొర గారు మాట్లాడుతూ గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో పోటీ పడాలి తప్ప ఇగోలకు పోయి ఓటమి పొందే పరిస్థితులను సృష్టించుకోకూడదన్నారు. ఎంపీటీసీగా గాని జడ్పిటిసిగా గాని పోటీ చేసే వ్యక్తి టిడిపియా , జనసేనా , బిజెపి యా అని చూడకుండా వాస్తవంగా గెలవగలిగే సామర్థ్యం అతనికి ఉందా? లేదా? అన్న మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు.
మన పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థి నిలబడాలనే వితండవాదం చేయకుండా గెలిచే అభ్యర్థులు మాత్రమే బరిలో దించే ప్రయత్నం చేయాలన్నారు. అందుకే సరైన అభ్యర్థి ఎంపికలోనే సగం గెలుపు ఉంటుందన్నారు. అధికారం ఉంది కాబట్టే మనమంతా సగర్వంగా తలెత్తుకోగలుగుతున్నామని అధికారం లేని గత ఐదేళ్ల కాలంలో ఎటువంటి దుర్భర పరిస్థితిని అనుభవించామో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.
అందుకే పైన నాయకత్వంలో కూటమి ఐక్యత ఏమాదిరిగా ఉందో మన దగ్గర కూడా ఆ మాదిరిగానే ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిస్తేనే మనం ఇంకా సగర్వంగా ఉండగలిగే పరిస్థితి ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. పొరపత్యాలు, ఇగోలకు పోకుండా గెలిచే అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసి ఆ జాబితాను తమకు అందిస్తే అధిష్టానానికి పంపిస్తామని వారు అభ్యర్థులను నియమిస్తారని తెలిపారు. అభ్యర్థుల నియామకంలో స్థానిక నాయకత్వం ప్రమేయం ఉండదన్నారు.




