Chintoor: చింతూరులో అంగన్వాడి కేంద్రాలకు కూరగాయల విత్తనాల పంపిణీ!

Chintoor: చింతూరులో సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 21 అంగన్వాడి కేంద్రాల కార్యకర్తలకు 12 రకాల కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Sept 2026 6:07 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో అంగన్వాడి కేంద్రాలకు కూరగాయల విత్తనాల పంపిణీ!

Chintoor: చింతూరులోని సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 21 అంగన్వాడి కేంద్రాలకు గాను 21 మంది అంగన్వాడి కార్యకర్తలకు 12 రకాల కూరగాయల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.బుధవారం చింతూరు ఎస్టీ కాలనీ అంగన్వాడి సెంటర్లో 21 మంది అంగన్వాడి సెంటర్లకు సంబంధించిన కార్యకర్తలకు12 రకాల కూరగాయల విత్తనాలను సంస్థ ఆర్గనైజర్ అహ్మద్ అలీ ఉచితముగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అహ్మద్ అలీ మాట్లాడుతూ సాపిడ్ స్వచ్ఛంద సంస్థ చింతూరు ఏజెన్సీలోని ప్రజలకు ఉపయోగపడే సేవలను చేయడం జరుగుతుందని అన్నారు.ఉచిత కూరగాయల పంపిణీ తో అంగన్వాడి కేంద్రాలలో కూరగాయల తోటలు వేసి తద్వారా వచ్చిన కూరగాయలతో అంగన్వాడి పిల్లలకు రుచికరమైన వంటకాలు చేసి వారికి ఆహారంగా అందించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ప్రియాంక,అంగన్వాడి టీచర్స్,సాపిడ్ సంస్థ ఆర్గనైజర్స్ లక్ష్మీ,నాగరాజు, జానకి,అశ్వని,కీర్తి,అంజలి పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR