Elamanchili: రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన!

Elamanchili: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపాలిటీలో రూ.24 కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో అభివృద్ధి పనులు. వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 22 Sept 2026 12:41 PM IST
Elamanchili
X

Elamanchili: రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన!

Elamanchili: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం వీఎంఆర్డీఏ నిధులు రూ.24 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు.

పట్టణంలో అభివృద్ధి పనులకు ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం అని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్కుమార్, ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు హాజరుకానున్నారు. వీఎంఆర్డీఏ కేటాయించిన ఈ నిధులతో అన్ని వార్డుల్లో రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఇతర మౌలిక వసతుల పనులు చేపడతారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM