Rolugunta: అంబేద్కర్ విగ్రహం వద్ద సిమెంట్ బల్లలు వేయించిన వార్డు సెక్రటరీ
Rolugunta: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అడ్డసారంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వార్డు సెక్రటరీ అనిమిరెడ్డి రమణ సొంత నిధులతో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు.
Rolugunta: అంబేద్కర్ విగ్రహం వద్ద సిమెంట్ బల్లలు వేయించిన వార్డు సెక్రటరీ
అనకాపల్లి జిల్లా: రోలుగుంట మండలం అడ్డసారం గ్రామ పంచాయతీకి సంబంధించి అడ్డసారం గ్రామంలో అంబేద్కర్ యూత్ వారు అంబేడ్కర్ విగ్రహం వద్ద సాయంత్రం వేళల్లో కూర్చోవడానికి అనువుగా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయమని ఇదే రోలుగుంట మండలానికి చెందిన అనిమిరెడ్డి రమణ( వార్డు సెక్రటరీ)ను కోరగా సొంత నిధులతో రెండు సిమెంట్ బల్లలు అడిగిన వెంటనే వేయించడం జరిగింది.
అదేవిధంగా తొందరలో ఇక్కడ పార్క్ వాతావరణం ఉండేటట్టు టైల్స్ వేయించి సుందరీకరణ చేయుటకు తన సహకారం అందిస్తాను అని తెలియజేయడం జరిగింది.అదేవిధంగా రోలుగుంట మండలం లో 24 పంచాయతీలలో దేవాలయాలు వద్ద సిమెంట్ బల్లలు ఏర్పాటుకు కావాలి అంటే నన్ను సంప్రదించమని ఈ సందర్భంగా రమణ తెలియజేశారు.
అడ్డసరం అంబేద్కర్ యూత్ సభ్యులు తమకు అందించిన సహకారం మరువ లేనిది అని గతంలో అనేక మందిని అడిగిన ఫలితం లేదు అని అంబేద్కర్ యూత్ సభ్యులు తెలియజేస్తూ, రమణ సేవా కార్యక్రమాలు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు మరియు కృతజ్ఞతలు అంబేద్కర్ యూత్ సభ్యులు తెలియజేశారు.




