Rolugunta: బాధితుడి ఇంటి నిర్మాణానికి వార్డు కార్యదర్శి రమణ చేయూత
Rolugunta: రోలుగుంట మండలం బుచ్చింపేటలో ప్రకృతి వైపరీత్యానికి ఇల్లు కోల్పోయిన పెదపూడి దుర్గరాజుకు వార్డు కార్యదర్శి అనిమిరెడ్డి రమణ 50 సిమెంట్ బస్తాల సాయం అందించారు.
Rolugunta: బాధితుడి ఇంటి నిర్మాణానికి వార్డు కార్యదర్శి రమణ చేయూత
అనకాపల్లి జిల్లా: రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామ పంచాయతీ కి చెందిన పెదపూడి దుర్గ రాజు కి సంబంధించి ప్రకృతి వైపరీత్యం వల్ల తను ఉంటున్న పెంకుటిల్లు నేలకి వరగటం జరిగింది.
దీనిలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ (వార్డు కార్యదర్శి) తల్లితండ్రులు లేని రోలుగుంట మండలం లోని పిల్లలు కు సహాయ సహకారాలు అందిస్తాను అని గతంలో తెలియజేసిన విషయాన్ని గుర్తు చేసి, సొంతింటి కలను సహకారం చేయుటలో తనకు సహాయ సహకారాలు అందించమని దుర్గ రాజు రమణ గారిని కోరగా వెంటనే స్పందించిన అనిమిరెడ్డి రమణ (వార్డు కార్యదర్శి) తన సొంత నిధులతో 50 సిమెంట్ బస్తాలు కి సంబంధించి నిధులు అందించటం జరిగింది.
అదేవిధంగా మనోధైర్యంగా ముందుకు సాగాలి అని మిత్రుడు దుర్గరాజుకు తెలియజేసి భవిష్యత్తులో కూడా తన సహాయ సహకారాన్ని నీ విషయంలో అందించటంలో ముందు ఉంటాను అని చెప్పటం జరిగింది. దీనిలో భాగంగా విద్యా అవసరాల విషయంలో రోలుగుంట మండలంలో తల్లితండ్రులు లేని పిల్లలు ఉంటే వారి వివరాలు తమ దృష్టికి తీసుకురావాలి అని ఈ సందర్భంగా రమణ తెలియజేశారు.




