Rolugunta: జానకిరామపురంలో వ్యక్తిపై దాడి నలుగురిపై కేసు నమోదు!

Rolugunta: రోలుగుంట మండలం జానకిరామపురంలో భూవివాదం నేపథ్యంలో వ్యక్తిపై దాడి చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 30 Sept 2026 5:40 PM IST
Rolugunta
X

Rolugunta: జానకిరామపురంలో వ్యక్తిపై దాడి నలుగురిపై కేసు నమోదు!

Rolugunta: జానకిరామపురం గ్రామంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురిపై రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పైల శ్రీను (25) ఈ నెల 28న గ్రామంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భోజనం చేస్తున్న సమయంలో, భూవివాదానికి సంబంధించిన అంశంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.

ఈ ఘటనలో శ్రీను తలకు గాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రోలుగుంట పోలీసులు FIR నంబర్ 64/2026 నమోదు చేశారు. BNS సెక్షన్లు 118(1), 351(3)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు అధికారిగా ఎస్‌ఐ పీ. రామకృష్ణరావు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam