Madhurawada: వీహెచ్‌పీ మధురవాడ ప్రఖండ అధ్యక్షుడిగా రామశర్మ ఏకగ్రీవం

Madhurawada: విశ్వ హిందూ పరిషత్ మధురవాడ ప్రఖండ అధ్యక్షుడిగా ప్రముఖ ఉపాధ్యాయులు, జ్యోతిష్య పండితులు రేజేటి గురునాథ రామశర్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

JAI RAM, MADURAWADA
Published on: 4 Oct 2026 8:15 PM IST
Madhurawada
X

Madhurawada: వీహెచ్‌పీ మధురవాడ ప్రఖండ అధ్యక్షుడిగా రామశర్మ ఏకగ్రీవం

మధురవాడ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మధురవాడ ప్రఖండ అధ్యక్షుడిగా రేజేటి గురునాథ రామశర్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. విద్యా రంగంలో సుదీర్ఘ అనుభవంతో పాటు ధార్మిక, ఆధ్యాత్మిక సేవల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రామశర్మ ఎం.ఏ., బి.ఎడ్. విద్యార్హతలు కలిగి ఉన్నారు. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 15 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో సంస్కారం, ధార్మిక విలువలు, భారతీయ సంస్కృతిపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు.

ఉపాధ్యాయ వృత్తి అనంతరం జ్యోతిష్య శాస్త్రవేత్తగా, పురోహితుడిగా ధార్మిక సేవలను కొనసాగిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక, సనాతన ధర్మ సంబంధిత అంశాల్లో మార్గదర్శనం చేస్తున్నారు. 2025–26లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పోటీ పరీక్షల్లో జడ్జిగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా రామశర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వీహెచ్‌పీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యత, యువతలో ధార్మిక–సాంస్కృతిక విలువల పెంపొందింపు, భగవద్గీతతో పాటు భారతీయ సంస్కృతి ప్రచారం కోసం కృషి చేస్తానన్నారు.

మధురవాడ ప్రఖండ పరిధిలో వీహెచ్‌పీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, వివిధ వర్గాలను సేవా కార్యక్రమాలతో అనుసంధానిస్తూ ముందుకు సాగేందుకు కృషి చేస్తానని రామశర్మ పేర్కొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA