Visakhapatnam: అక్టోబర్ 7న గంభీరం ఐఐఎంలో రీజనల్ పార్టనర్‌షిప్ సమ్మిట్
Visakhapatnam: అక్టోబర్ 7న విశాఖ గంభీరం ఐఐఎంలో జరగనున్న రీజనల్ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
Visakhapatnam: అక్టోబర్ 7న గంభీరం ఐఐఎంలో రీజనల్ పార్టనర్‌షిప్ సమ్మిట్
విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా అక్టోబర్ 07న నిర్వహించనున్న రీజనల్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి గంభీరం ఐఐఎం ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మంగళవారం పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవో సంగీత్ మాధుర్, ఏపీఐఐసీ, ఈడీబీ, పరిశ్రమల శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రీజనల్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వేదిక, సమావేశ ప్రాంగణం, అతిథుల రాకపోకలు, పార్కింగ్, భద్రత, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారూ.




