Paderu: పాడేరులో ఘనంగా రెడ్ రిబ్బన్ మారథాన్!
Paderu: అల్లూరి జిల్లా పాడేరులో హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణపై యువతకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెడ్ రిబ్బన్ మారథాన్‌లో కలెక్టర్ పాల్గొని బహుమతులు అందజేశారు.
Paderu: పాడేరులో ఘనంగా రెడ్ రిబ్బన్ మారథాన్!
Paderu: అల్లూరి జిల్లా పాడేరు ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026లో భాగంగా “Run for a Healthier, HIV-Free Tomorrow” అనే సందేశంతో రెడ్ రిబ్బన్ 5కే మారథాన్‌ను బుధవారం నిర్వహించారు. యువతలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, పరీక్షల ప్రాధాన్యత, బాధితుల పట్ల వివక్ష నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
17 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ అవగాహన పరుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల, పాడేరు నుంచి ప్రారంభమైన 5కే మారథాన్ హుకుంపేట మండలం బర్మంగూడ గ్రామం వరకు కొనసాగింది.
హెచ్ఐవీ నివారణపై అవగాహన
ఈ సందర్భంగా “KNOW • CARE • ACT” అనే సందేశంతో యువతకు హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించారు. సురక్షితమైన పద్ధతులు పాటించడం, ప్రమాదకర ప్రవర్తనకు దూరంగా ఉండటం, హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం, సూదులు/సిరంజీలను పరస్పరం పంచుకోకపోవడం, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సహకారం మరియు మద్దతు అందించడం వంటి అంశాలను వివరించారు.
“Stop HIV – Stop Stigma”, “Awareness Today – A Healthier Tomorrow” వంటి సందేశాలతో యువతను హెచ్ఐవీ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.
మారథాన్ విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు
మారథాన్‌లో ప్రతిభ కనబరిచి బాలుర, బాలికల విభాగాల్లో మొదటి మరియు రెండవ స్థానాలు సాధించిన విజేతలకు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, IAS చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
బాలుర విభాగం
మొదటి బహుమతి: సీతం – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరకులోయరెండవ బహుమతి: సాయికుమార్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్.కోట
మొదటి బహుమతి: ఎస్. మంజుల – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరకులోయ
రెండవ బహుమతి: ఎస్. మధు – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు
మొదటి బహుమతిగా రూ.10,000/- చొప్పున, రెండవ బహుమతిగా రూ.7,000/- చొప్పున నగదు బహుమతులు అందజేశారు.
చెప్పులు లేకుండానే పరుగెత్తి ద్వితీయ బహుమతి సాధించిన ఎస్. మధుకు కలెక్టర్ మానవీయ ఆప్యాయత. ఈ మారథాన్‌లో బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు విద్యార్థిని ఎస్. మధు కాళ్లకు చెప్పులు లేకుండానే 5కే మారథాన్‌లో పరుగెత్తి రెండవ స్థానాన్ని సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.
విద్యార్థిని పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్
మారథాన్ సందర్భంగా ఎస్. మధు చెప్పులు లేకుండా పరుగెత్తుతున్న దృశ్యాలను వీడియోలో గమనించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, IAS, విద్యార్థిని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్. మధుకు స్వయంగా చెప్పులు/షూస్ కొనుగోలు చేసి అందించడం కార్యక్రమంలో అత్యంత మానవీయమైన ఘట్టంగా నిలిచింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించడమే కాకుండా, ఆమె అవసరాన్ని గమనించి వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, IAS మానవీయత, ఆప్యాయత మరియు ప్రోత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విద్యార్థిని పట్టుదలను అభినందించిన కలెక్టర్, యువతలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేతలందరినీ అభినందిస్తూ, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణలో అవగాహన, పరీక్షలు, సరైన వైద్య సలహా మరియు సామాజిక మద్దతు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
రెడ్ రిబ్బన్ 5కే మారథాన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన, క్రీడాస్ఫూర్తి, సామాజిక బాధ్యతతో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అపోహలు మరియు వివక్షను తొలగించాల్సిన అవసరంపై బలమైన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ ఎస్. కిరణ్‌కుమార్, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి, ASR జిల్లా, DM&HO కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు.




