Anakapalli: ఎల్‌బీపి అగ్రహారంలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం!

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎల్‌బీపి అగ్రహారం బంగారుమెట్టలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం.. తిలకించేందుకు బారులు తీరిన గ్రామస్థులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 2:48 PM IST
Anakapalli
X

Anakapalli: ఎల్‌బీపి అగ్రహారంలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం!

Anakapalli: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఎల్‌బీపి అగ్రహారం బంగారుమెట్ట గ్రామంలో అరుదైన బ్రహ్మకమలం పుష్పం వికసించింది. దేవాంగుల వీధిలో బూడిది శ్రీనివాస్ దంపతుల ఇంట్లో ఈ అరుదైన పుష్పం వికసించడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.

బ్రహ్మకమలం వికసించిన విషయం తెలుసుకున్న మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ దంపతుల ఇంటికి తరలివస్తున్నారు. అరుదైన పుష్పాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ, తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకుంటున్నారు. బ్రహ్మకమలం పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీనివాస్ దంపతుల ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI