Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Anakapalli: అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 4 Nov 2026 11:14 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని 24 మండలాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 427 ఎంపీటీసీ స్థానాలకు గాను 980 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, అచ్యుతాపురం, ఎస్.రాయవరం మండలాల్లోని ఒక్కో ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇక జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే.. జిల్లాలోని 24 మండలాల పరిధిలో మొత్తం 80 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎన్నికల విధుల్లో సుమారు 12 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా అనకాపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI