Dumbriguda: ఆటోలో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు!

Dumbriguda: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ శివారులో ఆటోలో తరలిస్తున్న 38 కేజీల గంజాయి స్వాధీనం. నలుగురిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

REHAMAN, ARAKU
Published on: 10 Oct 2026 10:29 AM IST
Dumbriguda
X

Dumbriguda: ఆటోలో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు!

Dumbriguda: సాయంత్రం సమయంలో కూడా ఎస్సై గారికి వచ్చిన సమాచారంపై పై అధికారులకు తెలియపరచి ఎస్ఐ గారు మరి సిబ్బందితోపాటు ASR. జిల్లా డుంబ్రిగూడ గ్రామ శివారులో ఆటోలో 38 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 38 కేజీస్ గంజాయి మరియు ఆటోని స్వాధీనపరచుకొని, వారిని అదుపులోకి తీసుకోవడమైనది.

వారిలో ముగ్గురు వ్యక్తులు పాడేరు మండలం కించూరు పంచాయతీకి చెందిన ఒంటి వీధులు గ్రామానికి చెందినవారు కాగా మరి ఒకరు జువైనల్ అయి ఉన్నారు. పై కేసును అరకు సర్కిల్ సిఐ గారు ఏ కోటేశ్వరరావు గారు దర్యాప్తు చేసి పై ముగ్గురు ముద్దాయిలను ఈ దినము రిమాండ్ కు పంపడమైనది మరియు జువైనలను చిల్డ్రన్ హోమ్కు పంపడమైనది.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU