Chintoor: బండరాళ్ల భూమి వద్దు, పంట పండే భూమి కావాలి!
Chintoor: పోలవరం ముంపు నిర్వాసితులు చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బండరాళ్ల భూమి కాకుండా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Chintoor: బండరాళ్ల భూమి వద్దు, పంట పండే భూమి కావాలి!
Chintoor: పోలవరం ప్రాజెక్టు వల్ల తమ ఊళ్లు, పొలాలు, ఇళ్లు ముంపుకు గురవుతున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున తమకు ఇవ్వాల్సిన భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలని డిమాండ్ చేశారు. తమకు చూపించిన భూమిలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయని, అక్కడ వ్యవసాయం ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు.
"ఇక్కడ సర్వస్వం కోల్పోతే.. అక్కడ మాకు మంచి భూమి చూపించాలి కానీ, రాళ్ల భూమి చూపిస్తే మేము ఎలా బతకాలి?" అంటూ నిలదీశారు.తమ న్యాయమైన డిమాండ్లపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ముంపు బాధితులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్ మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న భూమినే ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేవీపట్నంలోని భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందనే విషయాన్ని అందరినీ అడిగి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
నిర్వాసితులు ముంపు వల్ల సర్వస్వం కోల్పోతున్నారని, వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దేవీపట్నం భూమి స్వరూపం, వ్యవసాయ అనుకూలతలపై నిర్వాసితులతో చర్చించినట్లు తెలిపారు.




