Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర.
Anakapalli: అనకాపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Anakapalli: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జన్మదిన కేక్‌ను కట్ చేసి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కూటమి నాయకులు కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్రతో పాటు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




