Paderu: అల్లూరి జిల్లాలో ఘనంగా 'అడవి తల్లి బాట' రోడ్ల ప్రారంభోత్సవం!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో పీఎం జన్మన్ కింద 'అడవి తల్లి బాట'లో భాగంగా రూ.75 కోట్లతో నిర్మించిన 30 తారు రోడ్లను ప్రారంభించారు.
Paderu: అల్లూరి జిల్లాలో ఘనంగా 'అడవి తల్లి బాట' రోడ్ల ప్రారంభోత్సవం!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా,డుంబ్రిగుడ మండలం, చాపరాయి లో ఏర్పాటు చేసిన 30 రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగంగా ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ (పి.యం.జన్.మన్) పథకం కింద అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో భాగంగా 75.64 కిలోమీటర్ల మేర నిర్మించిన 30 తారు రోడ్ల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవాన్ని జిల్లా కలెక్టర్ నిషాంతి. ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె. సాహిత్, విజయనగరం జోన్, ఆర్ టి సి చైర్మన్ సియరి. దొన్నుదొర,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి ప్రారంభించారు.
ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్(పి.యం.జన్.మన్) పధకం క్రింద జిల్లా లోని 6మండలంలో మొత్తం ప్రారంభించిన ఈ రోడ్లు 30 తారు రోడ్లు, రహదారి పొడవు 75.64 కి.మీ, అంచనా విలువ రూ. 7068.96 లక్షలు (రూ. 70.68 కోట్లు).
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పిఐయూ , ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం ప్రారంభోత్సవ లో జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, సమావేశం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో అడవి తల్లి బాటలో భాగంగా రూ. 75 కోట్లతో 30 రహదారులు, పిఎం-జన్మన్ పథకం కింద దాదాపు రూ. 75 కోట్ల వ్యయంతో, 75 కిలోమీటర్ల మేర నిర్మించిన 30 బిటి రహదారులను మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ప్రారంభించడమైనదని, అరకు అసెంబ్లీ పరిధిలోని 5 మండలాల గిరిజన ప్రాంతాలకు ఈ రహదారుల వల్ల రవాణా సౌకర్యం ఏర్పడిందని,
జిల్లాలో రహదారుల పురో గతి, పిఎం-జన్మన్ మొదటి దశ కింద మంజూరైన 80 రోడ్లలో 30 పూర్తి కాగా, 16 రోడ్లు దాదాపు పూర్తి కావచ్చాయని, మరో 34 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అలాగే -2వ దశ కింద మంజూరైన 20 రోడ్లు, 11 బ్రిడ్జిలలో ఒక రోడ్డు పూర్తయిందని తెలిపారు.
పిఎమ్‌జిఎస్‌వై (PMGSY) కింద రూ. 91 కోట్ల అంచనాతో 35 రోడ్డు పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయని, APR RSP గ్రాంట్ కింద రూ. 13.17 కోట్లతో 6 రోడ్డు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు.
ఇప్పుడు ప్రారంభిచుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను మారుమూల ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని, ఈ నూతన హెల్త్ & వెల్నెస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా వైద్య సేవలు, వైద్య పరీక్షలు, మందులు, తల్లి-బిడ్డ ఆరోగ్య సంరక్షణ సేవలు ఉచితంగా అందుతాయని తెలిపారు.
రహదారి సౌకర్యాల వల్ల విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, నిత్యావసర సేవలు గిరిజన ప్రాంతాలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సియారి.దున్నదొర మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఈ రోడ్లు వల్ల మన సొంత ఊరు కళ నెరవేరిందని,ఈ నియోజకవర్గంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రి చొరవతో ఇప్పటి వరకు మంజూరు అయిన పనులు పూర్తి చేసుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నామన్నారు. అలాగే జనసేన నాయకులు చిరంజీవి, బిజెపి నాయకులు, జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు వి. దేవదాస్, కోసంగి గ్రామస్తులు, పెదపాడు పంచాయతీ చెందిన గ్రామస్తులు భీమరాజ్, వంతల వెంకట్రావు, రామానాయుడు ఈ రోడ్ల వల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉందని గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గెడ్డ దాటి మెయిన్ రోడ్డుకు రావాలంటే చాలా ఇబ్బందులు పడే వాళ్ళని, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తేవాలంటే కూడా వర్షాకాలం ఇబ్బందులు పడే వాళ్ళమని, ఈ రోడ్ల ఎంతగానో ఉపయోగకరంగా ఉందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రొజెక్టర్ అధికారి ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె సాహిత్, ఐటిడిఏ ఏపీవో (పివిటిజి )ఏం.వెంకటేశ్వరరావు, పి ఐ యు ఈ ఈ రామకృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వేణుగోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ నాగేశ్వరరావు, ఎస్ఎంఐ ఈ ఈ ఏం. రాజేంద్ర కుమార్, పిఆర్ ఈఈ పాడల్, డిఈ అరకు కళ్యాణ్, డిఈ పెదబయలు, డిఈ జనార్ధన్,
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మూడు గ్రామంలో కోసంగి పెదపాడు చంపపుట్టి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




