Visakhapatnam: ఏపీ పెవిలియన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం!

Visakhapatnam: విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పెవిలియన్‌ను సందర్శించారు.

SHIVA, BHIMILI
Published on: 12 Nov 2026 12:27 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఏపీ పెవిలియన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం!

Visakhapatnam: ఏపీ పెవిలియన్ ప్రాంగణాన్ని ఆసక్తిగా పరిశీలించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఏపీ పెవిలియన్‌లో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు కళాకృతుల వద్ద ఫొటో దిగిన కేంద్ర మంత్రి పీయూష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. తిరుపతి, విశాఖపట్టణం, అమరావతి ఎకనమిక్ రీజియన్లల్లో చేస్తున్న అభివృద్ధిని వివరించిన అధికారులు.

సీఆర్డీఏలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజెంట్ చేసిన అధికారులు. విశాఖ అభివృద్ధిపై డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు. అరకు కాఫీ స్టాల్ వద్ద కేంద్ర మంత్రి పీయూష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి అరకు కాఫీని రుచి చూసిన సీఎం చంద్రబాబు.

ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించిన నేతలు. గిరిజనుల రూపొందిచిన చిత్రాలను ప్రత్యేకంగా తిలకించి... నమూనా చిత్రాలను తీర్చిదిద్దిన కేంద్ర మంత్రి, సీఎం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ కళలకు చెందిన ప్రముఖుల పేర్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించిన నేతలు.

ఏయే కళాకారులు... ఏయే రంగాల్లో ప్రావీణ్యత సాధించారోననే అంశాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. తోలబొమ్మలాట, పెన్ కలంకారీ సహా వివిధ కళాకృతుల స్టాళ్లను సందర్శించిన నేతలు. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల వివరాలను నేతలకు ప్రజెంట్ చేసిన అధికారులు.

సదస్సు ప్రాగంణంలో కొద్దిసేపు బ్యాటరీ కారులో ప్రయాణించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI