Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక!

Anakapalli: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీ శౌర్య మాన్ పటేల్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 Sept 2026 2:51 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక!

Anakapalli: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు పలువురు అర్జీదారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వారి నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్‌తో పాటు జిల్లా పంచాయతీ అధికారి సందీప్ వినతులను స్వీకరించారు.

అర్జీదారులు సమర్పించిన వినతులను పరిశీలించిన అధికారులు, సంబంధిత సమస్యలపై శాఖల వారీగా చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI