Sabbavaram: వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

Sabbavaram: సబ్బవరం మండలం అజనగిరి పరిధిలో వినాయక ఉత్సవాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

GOPI, PENDURTHI
Published on: 2 Oct 2026 6:02 PM IST
Sabbavaram
X

Sabbavaram: వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

సబ్బవరం: సబ్బవరం మండలం అజనగిరి గ్రామ పరిధిలోని నంగినారపాడులో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ అనంతపద్మనాభ స్వామి సహిత దశావతారాల వినాయకుడి అష్టాదశ రాత్రుల ఉత్సవాలలో శుక్రవారం పెందుర్తి శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొన్నారు.

స్థానిక సీనియర్ నాయకులు ఇందల రమణ మరియు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నంగినారపాడు చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు, యూత్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ... 18 రోజుల పాటు ప్రతిరోజూ ఒక్కో దశావతార రూపంలో వినాయకుడిని ప్రతిష్టించి, అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామాల్లో యువత భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషదాయకమని కొనియాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో జరిగే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI