Parawada: గండివానిపాలెంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూజలు
Parawada: పరవాడ మండలం గండివానిపాలెంలో నూతనంగా నిర్మించిన సీతారామ సమేత వీరాంజనేయ స్వామి ఆలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూజలు చేశారు.
Parawada: గండివానిపాలెంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూజలు
Parawada: పరవాడ మండలం పెదముసిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ సీతారామ సమేత వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పరవాడ మండల ప్రధాన కార్యదర్శి, ఆలయ చైర్మన్ కరణం నరసింహారావు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో చోడవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్. రాజు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు పంచకర్ల ప్రసాద్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డపు శ్రీనివాసరావు, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పిల్లా సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బిగిడి రామ గోవింద్, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బలిరెడ్డి అప్పారావు, మండల ఉపాధ్యక్షులు వెన్నెల నరసింహారావు, సీనియర్ నాయకులు ఇందల రమణ, డొల్ల రాము నాయుడు, చింతకాయల ముత్యాలు, సుందరపు శ్రీనివాసరావు, మడక రమణ, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, కోన మోహన్ కుమార్ నాయుడు, సత్తి రాజు, అర్జల్ల అప్పలరాజు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




