Pendurthi: మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నివాళులు
Pendurthi: పెందుర్తి నియోజకవర్గం నంగినారుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
Pendurthi: మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నివాళులు
పెందుర్తి: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి ఉత్సవాల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం, జీవీఎంసీ 88వ వార్డు నంగినారుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ... సత్యం, అహింస అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర్య సమరానికి దిశానిర్దేశం చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ హితానికి, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.




