Pendurthi: గెలిచిన కూటమి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే పంచకర్ల సత్కారం!
Pendurthi: స్థానిక సంస్థల్లో గెలిచిన కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లను పెందుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు.
Pendurthi: గెలిచిన కూటమి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే పంచకర్ల సత్కారం!
పెందుర్తి, నవంబర్ 10: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లను పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. మంగళవారం పెందుర్తి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో సాధించిన విజయం మరింత బాధ్యతను పెంచిందని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులోనూ కూటమి మరింత బలోపేతం అయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లకు మరోసారి అభినందనలు తెలియజేశారు.




