Pedagantyada: ముసలినాయుడుపాలెం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

Pedagantyada: పెదగంట్యాడ ముసలినాయుడుపాలెం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు, జ్వాలా తోరణం; బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని పాల ప్రసాదం పంపిణీ.

PRAKASH, GAJUWAKA
Published on: 24 Nov 2026 9:08 PM IST
Pedagantyada
X

Pedagantyada: ముసలినాయుడుపాలెం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

పెదగంట్యాడ: పెదగంట్యాడ ముసలినాయుడుపాలెం శివాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కిలాని ముసలయ్య ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు.

ఆవు నెయ్యి తో దీపారాధన చేశారు. అగోరాలు శివలింగం వద్ద మహా రుద్రాభిషేకం చేసారు. అనంతరం జ్వాలా తోరణం వెలిగించి,హర హర మహాదేవ శంభో శంకర అంటూ ప్రదక్షిణలు చేసారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున కోజాగిరి ద్వారా నిండు వెన్నెల కిరణాలు పడేలా ఆరుబయట పాలు మరిగించి అందరికీ ప్రసాదంగా పంపిణీ చేసారు.

ఈ పాలు తాగితే సర్వరోగాలు పారదోలే ఔషధంగా ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కిలాని ముసలయ్య ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాయుడు ,ఆర్.ఎస్.ఎస్ నాయకులు పివి రమణయ్య , నాగేశ్వరరావు,అప్పలనాయుడు బారీగ భక్తులు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA