Pedabayalu: ప్రజలకు సకాలంలో గ్యాస్ అందించాలి
Pedabayalu: పెదబయలులో జీసీసీ గ్యాస్ గోడౌన్, పెట్రోల్ బంక్‌ను పరిశీలించిన చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
Pedabayalu: ప్రజలకు సకాలంలో గ్యాస్ అందించాలి
పెదబయలు: ప్రజలకు సకాలంలో గ్యాస్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆదేశించారు. పెదబయలు మండలంలోని జీసీసీ గ్యాస్ గోడౌన్, డీఆర్ డిపో, పెట్రోల్ బంక్‌తో పాటు జీసీసీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి అక్కడి నిర్వహణ, గ్యాస్ నిల్వలు, సరఫరా, పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు.
అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్ను దొరతో కలిసి కిడారి శ్రావణ్ కుమార్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్యాస్ గోడౌన్‌లో నిల్వలు, సరఫరా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
అవసరమైన మేరకు గ్యాస్ నిల్వలను అందుబాటులో ఉంచి, వినియోగదారులకు సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గ్యాస్ పంపిణీలో జాప్యం చేసినా, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం డీఆర్ డిపో, పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు జీసీసీ ద్వారా అందుతున్న సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు, మండల అధ్యక్షులు వెచ్చంగి కొండయ్య, మాజీ సర్పంచ్‌లు బాకూరు వెంకటరమణ, పాంగి పాండురంగస్వామి, దాసు బాబు, ఎస్టీ సెల్ కార్యదర్శి సాగర సుబ్బారావు, పీఏసీఎస్ చైర్మన్ నారంజి ప్రసాద్, కూడ భూషణరావు, టీడీపీ నాయకులు కిమంకరి బొంజుబాబు, కొర్ర రాజారావు, పాంగి ధన్ను, టైసాబు త్రినాద్, లొట్టి చిన్ని, అబ్దుల్, జంపారంగి తిరుపతి, కోడా కోటి, మరిచేట్టు అప్పలనాయుడు, బత్తిరి రామారావు, అచ్చిబాబు, పృద్వి, సత్యారావు, బాలు, లకే రాజారావు, సీకరి వెంకటరమణ, సుబ్బారావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




