Anakapalli: అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాలకు బడి బసులు ఏర్పాటు చేయాలి!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అన్ని పట్టణ, రూరల్ ప్రాంతాలకు ప్రత్యేక బడి బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు PDSO వినతిపత్రం అందజేసింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 5 Oct 2026 3:39 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాలకు బడి బసులు ఏర్పాటు చేయాలి!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అన్ని పట్టణ, రూరల్ ప్రాంతాలకు బడి బస్సులను ఏర్పాటు చేయాలని పిడిఎస్ఓ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి ఎస్. రుద్రి మాట్లాడుతూ "జిల్లాలోని విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక మంది విద్యార్థులు ఆటోలలో డబ్బులు చెల్లించుకొని కాలేజీలకు, స్కూళ్లకు వస్తున్న పరిస్థితి ఉంది. అనేకమంది విద్యార్థులు బస్సులలో చోటులేక, ఫుట్పాత్ మీద నిల్చుంటూ జారి పడిపోతున్నారు. అలాగే జిల్లాలో గత సంవత్సరం కొన్ని రూట్ లలో తిరిగే బడి బస్సులను కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆపివేయడం జరిగింది. కాబట్టి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా అన్ని రూరల్ , పట్టణ ప్రాంతాలకు బడి బస్సులను ఏర్పాటు చేసి, వారి కాలేజీ, స్కూల్ సమయాలకు అనుకూలంగా నడపాలని, అలాగే గతంలో నిలిపివేసిన బడి బస్సులను తిరిగి పునరుద్ధరించాలని" అన్నారు.

అలాగే పిడిఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు కె. మణికుమార్ మాట్లాడుతూ.."చోడవరం - కోనాం రూట్లో నడిచే బస్సును ఈ విద్యా సంవత్సరం నుంచి నిలిపివేయడం జరిగింది. కాబట్టి తిరిగి ఆ బడి బస్సును వెంటనే పునరుద్ధరించాలి, చోడవరం - అనకాపల్లి రూట్ లో, చోడవరం - మాడుగుల రూట్ లో, చోడవరం - రావికమతం రూట్లో, అనకాపల్లి - నర్సీపట్నం రూట్ లలో, ఎలమంచిలి నుంచి వెంకటాపురంకి ప్రత్యేక బడి బస్సును ఏర్పాటు చేయాలి, ఎలమంచిలి నుంచి బంగారంపాలెంకి అదనపుగా మరొక బడి బస్సును ఏర్పాటు చేయాలి, మా ఈ డిమాండ్లను పరిష్కారం చేయని పక్షంలో జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM