Anakapalli: తుపాను ముప్పు వేళ మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Anakapalli: అర్నబ్ తుపాను నేపథ్యంలో పాయకరావుపేట రేవుపోలవరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. మత్స్యకారులను అప్రమత్తం చేసిన వైనం.

RAJU, PARAYAKARAOPETA
Published on: 27 Oct 2026 2:27 PM IST
Anakapalli
X

Anakapalli: తుపాను ముప్పు వేళ మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Anakapalli: అర్నబ్ తుపాను నేపథ్యంలో రేవుపోలవరం గ్రామంలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు, వసతులపై అధికారులను ఆరా తీసిన మంత్రి. పునరావాస కేంద్రంలోని స్థానికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్న హోంమంత్రి.

రేవుపోలవరం తీరంలో మత్స్యకారులతో మాట్లాడిన మంత్రి అనిత. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన హోంమంత్రి. రేవుపోలవరం, బోయపాడు తీర ప్రాంతాల్లో తుపాను ముందస్తు చర్యలను పరిశీలించిన అనిత.

తుపాను తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి. ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారుల సూచనలు పాటించాలి. మంత్రి అనిత.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA