Payakaraopeta: పాయకరావుపేట నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం!

Payakaraopeta: పాయకరావుపేట నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్లు. మొత్తం 356 నామినేషన్లు దాఖలు కాగా వైసీపీ 149, టీడీపీ 136, జనసేన 47 నామినేషన్లు దాఖలు చేశాయి.

RAJU, PARAYAKARAOPETA
Published on: 23 Oct 2026 11:28 PM IST
Payakaraopeta
X

Payakaraopeta: పాయకరావుపేట నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం!

పాయకరావుపేట: అనకాపల్లి జిల్లా ,పాయకరావుపేట నియోజకవర్గంలో జెడ్పీటీసీ , ఎం.పి.టి.సి నామినేషన్ల స్వీకరణ ఆఖరి రోజు కొనసాగింది.నక్కపల్లి ,ఎస్.రాయవరం ,పాయకరావుపేట లో ఎం.పి.టి.సి లు నామినేషన్లు మండల ఎన్నికల అధికారి కి సమర్పించారు.నామినేషన్లు ఈ రోజుతో ముగియనుండడంతో దాదాపు మూడు మండలాల నుండి దాదాపు నామినేషన్లు పూర్తయ్యాయి.

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో అన్ని పార్టీల తరపున 356 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పాయకరావుపేట నుండి 118 నామినేషన్ లు దాఖలు కాగా నక్కపల్లి నుండి 137 నామినేషన్ లు ,ఎస్ రాయవరం నుండి 101 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఆయా మండలాల ఎన్నికల అధికారులు తెలిపారు.

వీటిలో అధికార పార్టీ తరపున తెదేపా నుండి 136 నామినేషన్ లు దాఖలు కాగా ప్రతిపక్ష వై.సి.పి నుండి 149 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. కూటమి లో భాగంగా జనసేన నుండి 47 నామినేషన్లు దాఖలు చేశారు.బి.జె.పి తరపున 4 ,జనతా బహుజన పార్టీ నుండి 1, ఇండిపెండెంట్ ఇతర అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ నెల 24 నామినేషన్ల పరిశీలన జరిగుతుందని ,ఈ నెల 27 న నామినేషన్ ఉప సంహారణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA