Visakhapatnam: పెందుర్తిలో ఏడు నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి!

Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో గత ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.

GOPI, PENDURTHI
Published on: 23 Sept 2026 2:46 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: పెందుర్తిలో ఏడు నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి!

Visakhapatnam: గత ఏడు నెలల కాలంలోనే విశాఖ జిల్లా, పెందుర్తి మండలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని జనసేన విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. బుధవారం మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎంపీపీ గండ్రెడ్డి మాలతి నగేష్ సహా ఎంపిటిసి సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. అందరినీ పేరుపేరునా శాలువాలతో సత్కరించి పూల బొకేలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సుమారు 7 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మండల పరిషత్ ను, ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుందని, ఆ తర్వాత కనీ విని ఎరుగని రీతిలో నిధులు సాధించి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసినట్లు వివరించారు.

ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులైన ఎంపీటీసీ లందరి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఇప్పుడున్న సభ్యులకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. పెందుర్తి మండల పరిషత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అలాగే గ్రామ పంచాయతీలు కూడా మంచి ప్రగతి సాధించాయని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI