Visakhapatnam: పంచగ్రామాల భూ సమస్యలపై పల్లా శ్రీనివాసరావుకు వినతి

Visakhapatnam: విశాఖ పంచగ్రామాల భూ సమస్యలు, 22-A1-C వివాదాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అడివివరం ప్రతినిధులు కోరారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 5 Oct 2026 2:29 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: పంచగ్రామాల భూ సమస్యలపై పల్లా శ్రీనివాసరావుకు వినతి

విశాఖపట్నం: అడివివరం ప్రజా సేవా సంఘం అధ్యక్షులు శ్రీ సిరిపురపు వరాహనరసింహం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు శనివారం గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పంచగ్రామాల భూ సమస్యలకు సంబంధించిన పలు అంశాలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లారు. పంచగ్రామాల భూ సమస్యల పరిష్కారం కోసం న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులతో పాటు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన ఖాళీ స్థలాల యజమానులు, ఇళ్ల యజమానుల హక్కులను పరిరక్షించేలా ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.

అదేవిధంగా, పంచగ్రామాల్లోని మిగిలిన గ్రామకంఠాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అడివివరంలోని మూడు గ్రామకంఠాలను 22-A1-Cలో చేర్చడం వల్ల గత 30 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు వివరించారు. ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.

ఈ కార్యక్రమంలో అడివివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పంచదార్ల ప్రసాద్, ఉపాధ్యక్షులు లండ చందు, గ్రామ పెద్దలు లండ సూరిబాబు, జర్రిపోతుల నరసింహమూర్తి, మేక కాసు గోపాల్, పాశర్ల తరుణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.