Paderu: ఈనెల 23న టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
Paderu: పాడేరులో ఈనెల 23న టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు. శ్రేణులు హాజరుకావాలని పిలుపు.
Paderu: ఈనెల 23న టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
పాడేరు: తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం లో ఈనెల 23న బుధవారం తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ప్రకారం పాడేరు లోని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు . తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గ గిడ్డి ఈశ్వరి తెలిపారు.
ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలో ఉన్న రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు, మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, ఎంపీటీసీలు, మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీలో వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆమె కోరారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పార్టీ క్యాడర్ బలపడే అనేక విషయాలు ఈ సమావేశంలో చర్చించి ప్రతి ఒక్కరి సలహా సూచనలు మేరకు పాడేరులో స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలమైన శక్తిగా గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త పార్టీకి అండగా నిలిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు




