Paderu: పాడేరు జిల్లాలో కళాశాలల్లో ప్రత్యేక ‘స్వీప్’ ఓటరు అవగాహన కార్యక్రమాలు

Paderu: పాడేరు జిల్లాలో 'స్వీప్' ఆధ్వర్యంలో కళాశాలల్లో ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమాలు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ పిలుపు.

SAI, PADERU
Published on: 28 Sept 2026 7:06 PM IST
Paderu
X

Paderu: పాడేరు జిల్లాలో కళాశాలల్లో ప్రత్యేక ‘స్వీప్’ ఓటరు అవగాహన కార్యక్రమాలు

పాడేరు: జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు, అవగాహన కొరకు ‘స్వీప్’ (Systematic Voters’ Education and Electoral Participation) కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ మేరకు జిల్లా ఎన్నికల విభాగం కేటాయించిన షెడ్యూల్ ప్రకారం,ఓటరు నమోదు, అవగాహన కై జిల్లా స్థాయి అధికారులను ఆయా కళాశాలలకు ప్రత్యేకంగా నియమించామన్నారు.

తొలిసారి ఓటర్లపై ప్రత్యేక దృష్టి, 18 ఏళ్లు నిండిన యువత, తొలిసారి ఓటు హక్కు పొందబోయే విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యంపై సమగ్ర అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.

ఫారం-6 (Form-6) ద్వారా నమోదు, అర్హులైన విద్యార్థులందరితో అక్కడికక్కడే ఫారం-6 భర్తీ చేయించి నూతన ఓటర్లుగా నమోదు ప్రక్రియ కార్యక్రమం వేగవంతం చేస్తారని తెలిపారు.

అధికారులకు కార్యక్రమం పై స్పష్టమైన అవగాహనతో ఉండాలని, ఓటరు నమోదు పై సూచనలు, నిర్థిష్టమైన మార్గదర్శకాలు,సలహాలు, ఎప్పటికే ఇవ్వడం జరిగిందని వాటిని తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ ఓటరు నమోదు కార్యక్రమనికి నియమించబడిన సిబ్బంది ఇందుకు సంబందించిన అధికారులు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఓటర్ నమోదు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు జరిగే విదంగా చూడాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం సంబంధిత నివేదికలను, ఛాయాచిత్రాలను (Photos) జిల్లా ఎన్నికల విభాగానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

SAI, PADERU

SAI, PADERU