Paderu: పాడేరులో రేపు కూటమి సమన్వయ కమిటీ భేటీ: గిడ్డి ఈశ్వరి

Paderu: అల్లూరి జిల్లా పాడేరు శంకరన్ ఆడిటోరియంలో రేపు నియోజకవర్గస్థాయి కూటమి సమన్వయ సమావేశం జరగనుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు.

SAI, PADERU
Published on: 2 Oct 2026 3:21 PM IST
Paderu
X

Paderu: పాడేరులో రేపు కూటమి సమన్వయ కమిటీ భేటీ: గిడ్డి ఈశ్వరి

అల్లూరి జిల్లా: పాడేరులోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఎన్ శంకరన్ ఆడిటోరియంలో పాడేరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, తెలుగుదేశం పార్టీ మండల జనరల్ సెక్రెటరీ, పిఎసిఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు హాజరు కావలసిందిగా ఆమె కోరారు.

గ్రామస్థాయి నుండి కూటమి ప్రభుత్వం బలపడే రీతిగా ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్రతి కార్యకర్తను నాయకులు సిద్ధపరచరీతిగా ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించే రీతిగా ఈ సమావేశం జరుగునుంది

కావున ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరై కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకములు గ్రామస్థాయిలో కార్యకర్తలు ప్రజలను బలపరచరీతిగా సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశంలో అనేక తీర్మానాలు చేయనున్నారు.

పాడేరు నియోజకవర్గం స్థాయిలో జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి కోరారు.

SAI, PADERU

SAI, PADERU