Paderu: తుఫాన్ హెచ్చరికలతో అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి జేసీ!
Paderu: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రేషన్ దుకాణాలన్నీ తెరిచి ఉంచాలని అల్లూరి జిల్లా జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం. నిత్యావసర సరుకుల పంపిణీపై పర్యవేక్షణ.
Paderu: తుఫాన్ హెచ్చరికలతో అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి జేసీ!
Paderu: అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని అన్ని చౌక ధరల రేషన్ దుకాణాలను తెరిచి ఉంచి, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులను అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని తెలిపారు. రేషన్ దుకాణాల నిర్వహణ, సరుకుల నిల్వలు, పంపిణీ ప్రక్రియను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ప్రజలు తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.




