Paderu: పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్.. 153 ఫిర్యాదులు స్వీకరణ

Paderu: పాడేరు ఐటీడీఏలో జేసీ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. మొత్తం 153 ఫిర్యాదులు స్వీకరించి, సత్వర పరిష్కారానికి ఆదేశించారు.

SAI, PADERU
Published on: 9 Oct 2026 5:38 PM IST
Paderu
X

Paderu: పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్.. 153 ఫిర్యాదులు స్వీకరణ

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం శుక్రవారం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో యథావిధిగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. జాయింట్ కలెక్టర్‌తో పాటు పాడేరు సబ్ కలెక్టర్ శ్రీ కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్, ఐఏఎస్, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖలకు పంపిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా ప్రక్రియ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో 153 ఫిర్యాదులు నమోదయ్యాయి. శాఖల వారీగా ఫిర్యాదుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) – 4

2. పంచాయతీరాజ్ శాఖ (PR) – 17

3. గృహ నిర్మాణ శాఖ (Housing) – 1

4. జిల్లా పంచాయతీ కార్యాలయం – 2

5. గ్రామీణ నీటి సరఫరా శాఖ (RWS) – 4

6. అటవీ శాఖ – 1

7. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) – 2

8. ఎస్ఎంఐ – సాగునీటి శాఖ (SMI – Irrigation) – 4

9. గిరిజన సంక్షేమ శాఖ – 8

10. వ్యవసాయ శాఖ – 5

11. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA) – 5

12. రెవెన్యూ శాఖ – 70

13. సచివాలయాల శాఖ (SGSW) – 3

14. ప్రాజెక్టుల అమలు విభాగం (PIU) – 4

15. గిరిజన సంక్షేమ శాఖ – ఇంజినీరింగ్ విభాగం – 7

16. ఉద్యానవన, కాఫీ శాఖలు – 1

17. పౌర సరఫరాల శాఖ – 3

18. పర్యాటక శాఖ – 1

19. విద్యాశాఖ – 9

20. సమగ్ర శిక్షా అభియాన్ – 1

21. గురుకులం – 1

మొత్తం ఫిర్యాదులు: 153

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ, వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

పీజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో నమోదైన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్నా, వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఇతర లోపాలు చోటుచేసుకున్నా సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల సమస్యలు జిల్లా స్థాయికి చేరి జిల్లా పరిపాలనపై అనవసరమైన ఒత్తిడి పెరగకుండా, సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోనే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

SAI, PADERU

SAI, PADERU