Paderu: పాడేరు టీడీపీకి షాక్: YSRCPలో చేరిన అర్జున్ రావు!

Paderu: పాడేరులో టీడీపీకి షాక్.. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సమక్షంలో మాజీ సర్పంచ్ అర్జున్ రావుతో పాటు 120 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.

SAI, PADERU
Published on: 28 Oct 2026 7:28 PM IST
Paderu
X

Paderu: పాడేరు టీడీపీకి షాక్: YSRCPలో చేరిన అర్జున్ రావు!

Paderu: అల్లూరు జిల్లా పాడేరు మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల టిడిపి తరపున నామినేషన్ వేసిన ముర్ల అర్జున్ రావు సహా ఐనడా పంచాయతీ చీమలపల్లి గ్రామానికి కి చెందిన సుమారు 120 మంది టిడిపి శ్రేణులు పాడేరు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ సీపీ లో చేరారు.

పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వశ్వర రాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు అరాచకాలు, మరియు రాష్ట్ర సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల పరిపాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని అలాగే మేము నమ్ముకున్న పార్టీ మాకు వమ్ముచేసిందని అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నామని ముర్ల అర్జున్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు..*

కార్యక్రమంలో జెడ్పిటిసి అభ్యర్థి సీదరి రాంబాబు, ఎంపిటిసి అభ్యర్థి తూపురు గంగరాజు, ఐనడ మాజీ సర్పంచ్ ఈశ్వర్ రావు పాల్గొన్నారు. మాజీ సర్పంచులు వంతల రాంబాబు, వనుగు బసవన్న దొరా, సిరగం దశమూర్తి, నాయకులు సారే చిన లక్ష్మణ్, వజంగి రాజు, గెమ్మేలి బాలరాజు, తంబేల ఆనంద్, కర్రి బోయిన దేముడు తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU