Paderu: అల్లూరి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి
Paderu: అల్లూరి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి. కలెక్టర్ నిషాంతి ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు తెలిపిన డీపీవో చంద్రశేఖర్.
Paderu: అల్లూరి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి
పాడేరు: అల్లూరి సీతారామరాజు కు సంబందించిన ఎన్నికల సమగ్రీ చేరుకుంది. జిల్లాలో 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఎన్నికల సామాగ్రి రాష్ట్ర ఎన్నిక కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన సామగ్రిని అధికారులు విజయవంతంగా రాష్ట్ర ఎన్నిక కార్యక్రమం నుండి కట్టు దిట్టమైన భద్రత నడుమ జిల్లా కు చేరవేసిన ఎన్నిక సమగ్రీ జిల్లా పంచాయతీ అధికారి, సిబ్బంది స్వీకరించామని పేర్కొన్నారు.
ఈ సామాగ్రిలో చట్టబద్ధమైన (Statutory), చట్టబద్ధం కాని (Non-Statutory) ఫారాలు, ఎన్నికల అధికారులకు నిర్దేశించిన హ్యాండ్‌బుక్‌లు మరియు చెరిగిపోని సిరా (Indelible Ink) తదితర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి.
అందుబాటులోకి వచ్చిన ఈ ఎన్నికల సామాగ్రిని జిల్లా యంత్రాంగం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితమైన స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచమని, అలాగే సామగ్రి లెక్కింపు, సరిచూసే ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నరు. జిల్లాలో ఎన్నికలఅధికారి, జిల్లా కలెక్టర్ నిషాంతి.
ఆదేశాలు మేరకు సామాగ్రి స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరచడం జరిగిందని తెపారు.ఈ కార్యక్రమనికి సంబందించిన అన్ని పనులు సజావుగా, పారదర్శకంగా జరిపేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయని, ఇందుకు సంబంధిత సమగ్రీ అధికారులు జిల్లా కు చేరావేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి కె. పి చంద్ర శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.




