Paderu: జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సిబ్బందికి తొలిదశ శిక్షణ!

Paderu: పాడేరులో ZPTC, MPTC ఎన్నికల POలు, APOలకు తొలిదశ శిక్షణ. ఎన్నికల విధుల్లో నిబద్ధతతో వ్యవహరించాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిషాంతి టి. ఆదేశం.

SAI, PADERU
Published on: 26 Oct 2026 5:33 PM IST
Paderu
X

Paderu: జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సిబ్బందికి తొలిదశ శిక్షణ!

పాడేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (APSEC) నిబంధనల ప్రకారం, అల్లూరి జిల్లాలో జరగనున్న ZPTC, MPTC లకు సంబందించిన 2వ సాధారణ ఎన్నికల నిమిత్తం ప్రిసైడింగ్ అధికారులు (POs), సహాయ ప్రిసైడింగ్ అధికారులకు (APOs) మొదటి శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.

సోమవారం ఉదయం వి ఆర్ కె ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి, నిషాంతి. టి పాల్గొని మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ 2వ సాధారరణ ఎన్నికల విధుల్లో పాల్గొనే పిఓలు, ఏపిఓలు అధికారుల ఈ శిక్షణ కీలకమని, ప్రతిఒక్కరు ఇక్కడ చెప్పే అంశాలపై అవగాహన పొందాలని విధి నిర్వహిణ లో నిర్లక్ష్యం వద్దు, నిబద్ధతతో నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ శిక్షణ తరగతులలో మీకు అందించిన మాన్యువల్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదివి, అందులో పేజీలో ఉన్న ప్రతి అంశం తెలుసుకోవాలన్నారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు అందుకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ ప్రతి ఒక్కటి పరిశీలించి, చెక్ లిస్ట్ ప్రకారం ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి అన్నారు.

బ్యాలెట్ పేపర్ల పరిశీలన, నిర్వహణ,వాటిని ఉపయోగించని బ్యాలెట్ పేపర్లను సరిగ్గా తనిఖీ చేయడం, వాటి వెనుక సీరియల్ నంబర్ చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవడం, కౌంటర్ ఫాయిల్స్‌లో రోల్ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ సరిగ్గా నమోదు చేయడంపై స్పష్టమైన ఆదేశాలు స్పష్టం చేశారు . బ్యాలెట్ పేపర్ల కేటాయింపులో అత్యంత గోప్యత పాటించాలని, ఎటువంటి పొరపాట్లు లేదా నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

పోలింగ్ ప్రక్రియ, సమయపాలనతో పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్ల సమక్షంలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ లను ప్రదర్శించి, గ్రీన్ పేపర్ సీల్స్ ఏర్పాటు చేయడంపై క్షుణ్ణంగా వివరించారు. రిమోట్ ఏరియాలో ప్రత్యేక కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను నిర్ణీత సమయానికి,సాధారణంగా ఉదయం నుండి ప్రారంభమై సాయంత్రం నిర్ణీత సమయం వరకు జరిగే ఎన్నికలు పూర్తి చేసి, అధికారుల సిబ్బంది ఏజెంట్లు బాక్సులను షీల్ అనంతరం తిరిగి నిర్దేశించిన స్థలానికి చేరవలసిన బాధ్యత ప్రోసిడింగ్ అధికారులు సిబ్బoదేనని, చెక్ లిస్ట్ ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు.

పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు, సమన్వయం, పోస్టల్ బ్యాలెట్లు, రిసెప్షన్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాట్లు, అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన భోజన వసతి, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బంది అందరూ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే శిక్షణను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, డౌట్స్ ఉన్న అంశాన్ని శిక్షణ ఇచ్చే వారి నుండి అడిగి తెలుసుకోవాలని ప్రతి విషయాన్ని గమనించి తెలుసుకోవాలన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జనరల్ ఎన్నికల పరిశీలకులు రోనంకి కూర్మనాజ్, సబ్ కలెక్టర్ కె. సాహిత్, డిఇఓ ఎన్. భానుముర్తి రాజు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పి.బి.కె పరిమళ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి భీమ్ శంకరరావు, డిపిఓ చంద్రశేఖర రావు, డి ఎల్ పి ఓ పిఎస్ కుమార్, పీపుల్ ఏపీవోలు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU