Rolugunta: రోలుగుంటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు!

Rolugunta: అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ప్రజలు వినియోగించుకోవాలని అధికారుల విజ్ఞప్తి.

R. A. Naidu, Narsipatnam
Published on: 12 Oct 2026 12:34 PM IST
Rolugunta
X

Rolugunta: రోలుగుంటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు!

Rolugunta: రోలుగుంట మండలంలో ఎంపీడీవో ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రతి సోమవారం మండల కార్యాలయం నందు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో భాగంగా వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు అమ్మకాలు జరుగుతున్నాయి.వంకాయలు,బెండ, పచ్చి మిర్చి,గోంగూర,గోరుచిక్కుడు, తోటకూర, అరటి వంటి వాటిని అమ్మడం జరిగింది.

ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజలు వినియోగించడం వలన ఆరోగ్యం మెరుగుపడి ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయని ప్రకృతి వ్యవసాయం ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభానికి సంబంధించి డివిజన్ Mt. వరలక్ష్మి మేడం గారు,మండల ఇంచార్జి గంగరాజు సార్ ICRP లు,రైతులు,మండల ప్రెసిడెంట్ గారు, వెలుగు APM garu,CC గారు,మహిళ పోలీస్ మేడం గారు,మహిళలు పాల్గొనడం జరిగింది.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam