Gajuwaka: గొడ్డలి పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి: పల్లా
Gajuwaka: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును చూసి ప్రతిపక్ష గొడ్డలి పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
Gajuwaka: గొడ్డలి పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి: పల్లా
గాజువాక: రాష్ట్ర ప్రజలు. మున్సిపల్ మరియు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు చూసి గొడ్డలి పార్టీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాష్ట్ర టిడిపి అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా.
గాజువాక నియోజవర్గంలో ఉన్న అన్ని వార్డుల్లో ఆదర్శవంతంగా తెచ్చుదిద్దుతా 89వ కూటమి కార్యకర్తలకు పల్లా హామీ, గాజువాక మరియు అగనంపూడి జోన్ లో ఉన్న అన్ని వార్డుల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.జీవీఎంసీ 89 వ వార్డు కార్పొరేటర్ గా ఎన్నికైన ప్రసాదుల విజయ సునీత శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో కైలాస్ నగర్ అన్న కాంటీన్ వద్ద వార్డు నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, చేపడుతున్న సంక్షేమాన్ని స్వాగతిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని చేకూర్చారని అన్నారు. గెలుపొందిన కార్పొరేటర్లు ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించాలని,వార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో ఎక్కువ చొరవ చూపాలని సూచించారు.
ఎక్కడా లేని విధంగా గాజువాక నియోజకవర్గంలో ఈ రెండున్నరేళ్ల కూటమి పాలనలో సుమారు 250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు.అనంతరం విజయ సునీత శ్రీనివాస్ దంపతులు ఎమ్మెల్యే పల్లాను ఘనంగా సన్మానించారు.
వార్డ్ అధ్యక్షులు సింగూరు అనంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 74 వ వార్డు అధ్యక్షులు వియ్యపు కొండబాబు. నియోజకవర్గ సమన్వయకర్త పల్లా రమణ,మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు . మాజీ కౌన్సిలర్ బుట్ట సత్తిబాబు. టిడిపి సీనియర్ నాయకులు జజుల. గంగరాజు. స్టీల్ టి ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి. మహిళా నాయకులు రుక్. ఉరుకుటి ముత్యాలమ్మ. లక్కోజు దేవి. వరలక్ష్మి .ప్రసాదు. దొడ్డి వెంకటప్పరావు. కర్దాడ రామకృష్ణ.k కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




