Bhimili: తగరపువలసలో 50 ఇంకుడు గుంతల తవ్వకం: ఆలివర్ రాయి!

Bhimili: తగరపువలస పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ కొరకు సామాజిక వేత్త ఆలివర్ రాయి 50 ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

SHIVA, BHIMILI
Published on: 30 Sept 2026 3:05 PM IST
Bhimili
X

Bhimili: తగరపువలసలో 50 ఇంకుడు గుంతల తవ్వకం: ఆలివర్ రాయి!

Bhimili: ఎన్నో సంవత్సరాలుగా దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న ప్రజా బంధు, సామాజిక వేత్త, విద్యా దాత, మన భీమిలి అభిమాన బిడ్డ శ్రీ ఆలివర్ రాయి గారు, తన జన్మదినాన్ని మరో అర్థవంతమైన సేవా కార్యక్రమానికి నాందీ పలికారు.

ఇటీవల తగరపువలస మరియు పరిసర ప్రాంతాల్లో ఎదురైన నీటి ఎద్దడి అందరికీ తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతిఒక్కరు తమవంతు బాధ్యత తీసుకోవాలని భావించి తగరపువలస పరిసర ప్రాంతాల్లో 50 ఇంకుడు గుంతలను త్రవ్వించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ తీవ్రమైన నీటి సమస్యను కొంతవరకు నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం చెప్పటం అని తెలిపారు.

ఈ సేవా స్పూర్తి, సమాజ సేవ స్పూర్తి పిల్లలో కూడా కల్పించాలని, కేథరిన్ విద్యాసంస్థలలో చదివే ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా చేసిన వారికి ఫీజు లో 500 రూపాయల రాయితీ ఇస్తానని హామీ ఇచ్చారు.

ఒక పుట్టినరోజు వేడుకను ఒక సామాజిక ఉద్యమంగా మార్చిన ఈ ఆలోచనకు మనమందరం తోడ్పడుదాం. హెల్ప్ ఎయిడ్ తరుపున చేపట్టిన ఈ కార్యక్రమంకి వేంపాడ శ్రీనివాస్ గారి సౌజన్యంతో చేస్తున్న ఈ బృహత్తర ఉద్యమంలో అందరూ పాల్గోవాలని ఆలివర్ రాయి కోరారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI