Anakapalli: అనకాపల్లి 108వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!

Anakapalli: అనకాపల్లి 108వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా స్పౌజ్ పెన్షన్‌ను గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ లబ్ధిదారునికి అందజేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 2:07 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి 108వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!

Anakapalli: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ 108వ డివిజన్ పరిధిలోని 18వ సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన స్పౌస్ పెన్షన్‌ను కొణతాల అచ్చయ్యమ్మకు రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కీ ఆదేశాల మేరకు ఈ పెన్షన్‌ను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా విల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేస్తున్న కృషిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

కాగా, స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కొణతాల రామకృష్ణ సూచించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగ లింగేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మద్దాల నారాయణరావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI