Bheemili: భీమిలి మండలంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం!
Bheemili: భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో నూతన ప్రభుత్వ పాఠశాల ప్రారంభమైంది. విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రాగా, కాలువ పనులు కూడా పూర్తయ్యాయి.
Bheemili: భీమిలి మండలంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం!
Bheemili: భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చినట్లయింది.
అదేవిధంగా చిన్ని పేట హైస్కూల్ దారి నుంచి ఎస్సీ కాలనీ పెద్దగెడ్డ వరకు నిర్మించిన కాలువ పనులు పూర్తికావడంతో దానిని కూడా ప్రారంభించారు. కాలువ నిర్మాణంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేందుకు, స్థానికులకు ఇబ్బందులు తగ్గేందుకు అవకాశం ఏర్పడిందని నాయకులు తెలిపారు.
మరోవైపు ఎంపీటీసీగా కోరాడ రమణ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నాయకులు, స్థానికులు ఆయనను దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చుక్కల విజయబాబు, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, మండల పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు,ఆనందపురం టీడీపీ పార్టీ అధ్యక్షులు టీ.అప్పారావు, మాజీ పంచాయతీ ఉపసర్పంచ్ సింగపూర్ బుజ్జి,ఎంపీటీసీ కోరాడ రమణ, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, ఉపాధ్యాయులు అప్పలరెడ్డి, నాయకులు పాసి.త్రినాథ్, గొలగాని రాము,కొయ్య రామకృష్ణ,వేణు రాజు,మామిడి భాస్కరరావు, కాకర రమణ,చుక్క లక్ష్మణ,కోరాడ.సూరిబాబు సిద్దార్థ వర్మ,కె.సంతోష్, ఎన్.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.




