Koonavaram: కూనవరం కూటమి జడ్పీటీసీగా పాయం వెంకయ్య నామినేషన్

Koonavaram: కూనవరం కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ ఎంపీపీ పాయం వెంకయ్య రంపచోడవరంలో టీడీపీ, జనసేన మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 22 Oct 2026 8:22 PM IST
Koonavaram
X

Koonavaram: కూనవరం కూటమి జడ్పీటీసీగా పాయం వెంకయ్య నామినేషన్

కూనవరం: కూనవరం కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా పాయం వెంకయ్య గురువారం రంపచోడవరంలో నామినేషన్ దాఖలు చేశారు.బిజెపికి చెందిన పాయం వెంకయ్యకు టిడిపి, జనసేన పార్టీలు మద్దతుగా నిలిచాయి.గతంలో వెంకయ్య కూనవరం ఎంపీపీగా విధులు నిర్వర్తించడం జరిగింది.రాజకీయంగా పాయం వెంకయ్య పలు కీలక పదవులను చేపట్టడం జరిగింది.

పోలవరం ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన గిరిజనేతరులకు అండగా ఉండి వారి పక్షాన పోరాడిన నేతగా వెంకయ్యకు మంచి గుర్తింపు ఉంది.గత ఎన్నికల్లో కూనవరం జడ్పిటిసి స్థానాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది.కూటమి అభ్యర్థిగా పాయం వెంకయ్య పోటీలో నిలబడటంతో కూనవరం జడ్పిటిసి స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR