Anakapalli: 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డు'కు ఎంపికైన తాండవ ఆశ్రమ పాఠశాల!

Anakapalli: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ జీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాల 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ - 2026'కు ఎంపిక కావడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు.

REHAMAN, ARAKU
Published on: 30 Sept 2026 3:36 PM IST
Anakapalli
X

Anakapalli: 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డు'కు ఎంపికైన తాండవ ఆశ్రమ పాఠశాల!

Anakapalli: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ (జీటీడబ్ల్యూ) బాలికల ఆశ్రమ పాఠశాల రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ - 2026' కు ఎంపిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న ఈ ఆశ్రమ పాఠశాల 'స్వచ్ఛ హాస్టల్స్' విభాగంలో ఉత్తమ నిర్వహణ, పరిశుభ్రత కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును సొంతం చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణాధికారులు, సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరియు విద్యార్థినులకు సభాపతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

​హాస్టల్ ఆవరణ, నివాస బ్లాకుల పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునే సదుపాయాలు, భోజన శాల మరియు వంటగది నిర్వహణ, తడి-పొడి చెత్త వేరుచేసే విధానం వంటి అంశాలలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించి ఈ అవార్డు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU