Narsipatnam: కార్యకర్త హోటల్‌లో ముచ్చటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

Narsipatnam: నర్సీపట్నంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సందడి. ఎలాంటి హంగులు లేకుండా పాత బస్టాండ్ సమీపంలోని టిడిపి సీనియర్ కార్యకర్త తాతబాబు హోటల్‌లో టిఫిన్.

R. A. Naidu, Narsipatnam
Published on: 24 Oct 2026 2:58 PM IST
Narsipatnam
X

Narsipatnam: కార్యకర్త హోటల్‌లో ముచ్చటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

Narsipatnam: అనకాపల్లి జిల్లా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తాతబాబు హోటల్‌లో టిఫిన్ చేసిన శాసనసభాపతి. ఒకవైపు ఎన్నికల ప్రచారంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతుండగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనలోని నిరాడంబరతను, స్నేహశీలతను చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

​ఓ వైపు సభాపతి సతీమణి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా బిజీగా పర్యటిస్తుండగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనూహ్యంగా పాత బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అయిన తాతబాబు హోటల్‌కు విచ్చేశారు.

కార్యకర్త చేతి రుచికరమైన టిఫిన్ చేయాలన్న కోరికతో ఎలాంటి ప్రొటోకాల్స్, హంగులూ లేకుండా నేరుగా అక్కడికి చేరుకున్నారు.

​సాధారణ పూరిపాక హోటల్‌లో అందరితో కలిసి కూర్చుని టిఫిన్ చేశారు. అక్కడ ఉన్న పెద్దవారిని ఎంతో ఆప్యాయంగా చేతులు పట్టుకుని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తన మిత్రులతో సరదాగా గడిపారు.

అంతటి ఉన్నత స్థానంలో ఉండి కూడా ఒక కార్యకర్తను గుర్తు పెట్టుకుని సాధారణ వ్యక్తిలా వచ్చి కలిసిన స్పీకర్ అయ్యన్నను చూసి స్థానిక ప్రజలు, హోటల్ యజమాని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam