Narsipatnam: నర్సీపట్నంలో మున్సిపల్ ఎన్నికల భద్రత కోసం పోలీసుల ఫ్లాగ్ మార్చ్
Narsipatnam: నర్సీపట్నంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల్లో భద్రతా భావం కల్పిస్తూ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Narsipatnam: నర్సీపట్నంలో మున్సిపల్ ఎన్నికల భద్రత కోసం పోలీసుల ఫ్లాగ్ మార్చ్
నర్సీపట్నం: మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నర్సీపట్నం పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
నర్సీపట్నం పట్టణంలోని బాలిఘట్టం ప్రాంతం, పీవీఆర్ జంక్షన్ నుంచి శాంతినగర్, రామారావుపేట, కొత్తవీధి, గవరవీధి, తురకబడి, కాపువీధి, పాత సంతబయలు, ఎస్సీ కాలనీ, గొర్లివీధి, బ్రాహ్మణవీధి, మసీదు లైన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఘఫుర్తో పాటు సబ్ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది కలిపి మొత్తం 70 మంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఘఫుర్ స్పష్టం చేశారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.




