Narsipatnam: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నర్సీపట్నం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Narsipatnam: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నర్సీపట్నం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి విజ్ఞప్తి. ముందస్తు జాగ్రత్తలు.
Narsipatnam: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నర్సీపట్నం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Narsipatnam: అర్నబ్ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి నర్సీపట్నం ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వస్తున్న అర్నబ్ తుఫాన్ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప దయచేసి ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల సమీపంలో ఉండవద్దని సూచించారు.
తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉండాలని అత్యవసర మందులు, త్రాగునీరు మరియు సరిపడా ఆహార పదార్థాలను ముందుగానే ఇళ్లలో సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సహాయం అవసరమైతే వెంటనే అధికారులను, స్థానిక నాయకులను సంప్రదించాలని తెలిపారు.




