Narsipatnam: నర్సీపట్నంలో హోరెత్తిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం!
Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం 23, 24, 25 వార్డులలో మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Narsipatnam: నర్సీపట్నంలో హోరెత్తిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం!
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం పరిధిలోని 23, 24, 25, వార్డులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. భారీ జన సమూహంతో జరిగిన ఇంటింటి ప్రచారం ఆ పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపింది. గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత, 25 వ వార్డు కౌన్సిలర్ సుర్ల అప్పలనాయుడు, 24 వ వార్డు కౌన్సిలర్ సుర్ల భవాని, 23వ వార్డు కౌన్సిలర్ లావణ్య, ప్రచార కార్యక్రమంలో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వీరితో పాటు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసి పాత్రుడు ప్రచారంలో పాల్గొన్నారు. వీరికి అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఓటర్లు హారతులు పట్టి ఆశీర్వదించారు. 25 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్పలనాయుడు గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, పెరిగిన ధరలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఇది తన గెలుపుకు దోహదపడుతుందని కౌన్సిలర్ అభ్యర్థి సుర్ల నాయుడు అన్నారు.
24వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి భవాని మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం అందుబాటులో ఉంటాను అన్నారు. 23వ వార్డు కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత తన విజయానికి కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల కన్నా ముందున్నామని, ప్రజల నుంచి తమకు సానుకూల స్పందన లభిస్తున్నదని అన్నారు.




