Narsipatnam: ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించాలని వామపక్షాల నిరసన

Narsipatnam: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో వామపక్ష పార్టీలు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 2 Oct 2026 6:42 PM IST
Narsipatnam
X

Narsipatnam: ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను తొలగించాలని వామపక్షాల నిరసన

నర్సీపట్నం: ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ల నమ్మకాన్ని ఎన్నికల కమిషన్ పొందాలని అలాంటిది ప్రజల నమ్మకాన్ని కోల్పోయే విధముగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యవహరించారని వామ పక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ... ప్రత్యేక ఓటర్ల పరిశీలన పేరుతో దేశంలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కని, ఓటు హక్కును కొంతమందికి, కొన్ని వర్గాల ప్రజలకు తొలగించేందుకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగానే స్వతంత్ర వ్యవస్థగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ లో రాజకీయ జోక్యం పెరిగిందని,దానికి వూతమిచ్చే విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారని, విమర్శించారు.

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ లో మెజారిటీ ఎన్నికల కమిషనర్ ల అభిప్రాయమే నిర్ణయంగా ప్రకటించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంటే అలా కాకుండా మెజారిటీ ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించిన అంశాలను కూడా ప్రజలపై నిర్ణయాలు గా రుద్దడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు? ఇప్పటికైనా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంను ఆదేశించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ని తొలగించాలని డిమాండ్ చేశారు.

లేనియెడల దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలను, ఇతర రాజకీయ పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడతామని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో సిపిఎం నర్సీపట్నం కార్యదర్శి అడిగర్ల రాజు, సాపిరెడ్డి నారాయణ మూర్తి, ఎల్.గౌరీ, kvs ప్రభ, లక్ష్మి, CPI జిల్లా నాయకులు G. గురుబాబు, శ్రీరామూర్తి, రాధాకృష్ణ, cpm k.ప్రసన్న, ముఠా కార్మికుల సంఘం నాయకులు గోవిందరావు, నానాజీ, S. నాగ రమణ తదితరులు పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam